ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. చైర్ పర్సన్ అభివృద్ధికి సహకరించడం లేదంటూ అవిశ్వాస తీర్మాన కాపీని కలెక్టర్ సహా ఆర్డీవోకు అందజేశారు. చైర్ పర్సన్ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని విస్మరించిందని కౌన్సిలర్లు ఆరోపించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.