జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) స్థితి గురించి లోక్‌సభ ఎంపీ మాలా రాయ్ ప్రశ్నించారు. అంతేకాకుండా.. అస్సాంలో ఎన్‌ఆర్‌సి హోదాతో పాటు ఎన్‌ఆర్‌సికి సంబంధించిన పనులు ఎప్పుడు పూర్తవుతాయని కూడా రాయ్ అడిగారు. దీనికి సమాధానంగా నిత్యానంద రాయ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో భారతీయ పౌరుల జాతీయ రిజిస్టర్ను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’ అని ఆయన తెలిపారు.
