ఆర్టీసీలో ఈవీ ఆటోలు వద్దు..ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్కు బీఎంఎస్ పిలుపు

ఆర్టీసీలో ఈవీ ఆటోలు వద్దు..ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్కు బీఎంఎస్ పిలుపు

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఈవీ ఆటోలు వద్దని, ప్రభుత్వం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (బీఎంఎస్) అఖిల భారత ప్రధాన కార్యదర్శి రవిశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌‌‌‌లో బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో టాక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రవిశంకర్ ప్రభుత్వాన్ని కోరారు.

ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్న రూ.12 వేల సాయాన్ని బకాయిలతో సహా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.  ఓలా, ఉబర్, రాపిడో అక్రమ బైక్ సర్వీసులను అరికట్టాలన్నారు. ఆటో, క్యాబ్ మీటర్ చార్జీలు పెంచాలని, పోలీస్ ఈ-చలాన్లపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్ చేపడతామని హెచ్చరించారు. సుంకరి మల్లేశం, చింతల నంద కిషోర్, పెంటయ్య గౌడ్, శ్రీధర్ రెడ్డి, సమ్మయ్య యాదవ్, బాబు రాజ్, శ్రీనివాస్, జాంగిర్, అశ్విన్ పాల్గొన్నారు.