- లీటరుకు రూ.25–28 పెరుగుతుందన్న వార్తలు ఫేక్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి ఊహాగానాలు తప్పని, తప్పుదారి పట్టించేవని స్పష్టం చేసింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.25–రూ.28 వరకు పెరగొచ్చని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ రిపోర్ట్ హెచ్చరించగా, ఇది ఫేక్ న్యూస్ అని పెట్రోలియం మినిస్ట్రీ ఎక్స్ ద్వారా స్పందించింది.
“ఫేక్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న వార్తలు తప్పు. ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఏదీ లేదు” అని తెలిపింది. ప్రజల్లో భయాందోళనలు కలిగించడమే లక్ష్యంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయని, గత నాలుగేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల్లో తీవ్ర మార్పులు జరిగినా, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదని వివరించింది.

