
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని ఎన్సీపీ అధినేత శరత్ పవార్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీకి నోటీసులు వచ్చాయని తెలిపారు. దేశ రాజధాని ముఖ్యమంత్రి..అతనికి క్లీన్ ఇమేజ్ ఉన్న సాదాసీదా వ్యక్తి అని ఢిల్లీలో అందరికి తెలుసన్నారు. అతన్ని అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని శరత్ పవార్ అన్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కూడా ఇదే విధమైన సమన్లుజారీ చేయబడిందని, అతను కూడా అరెస్టును ఎదుర్కొనే ప్రమాదం ఉందని పవార్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా, ప్రజలు కేజ్రీవాల్‌ను పదవికి ఎన్నుకున్నారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రులు జైలు పాలయ్యారని ఆయనను కూడా జైలుకు పంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని శరత్ పవార్ ఫైర్ అయ్యారు.