నాగార్జున సాగ‌ర్ సంద‌ర్శ‌న‌కి ఎవ‌రూ రావ‌ద్దు

నాగార్జున సాగ‌ర్ సంద‌ర్శ‌న‌కి ఎవ‌రూ రావ‌ద్దు

న‌ల్గొండ జిల్లా: నాగార్జున‌ సాగ‌ర్ జలాశ‌యం నిండుకుండ‌లా మార‌డంతో సాగ‌ర్ ను సంద‌ర్శించ‌డానికి ప‌ర్యాట‌కులు ఎవ‌రు రావ‌ద్ద‌ని తెలిపారు పోలీసులు. ప‌ర్యాట‌కులు అధిక సంఖ్య‌లో రావ‌డం వ‌ల‌న క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని తెలిపారు స్థానిక ఎస్ ఐ శీన‌య్య‌. ప‌ర్యాట‌కులు సంద‌ర్శించ‌కుండా శివాల‌యం ఘాట్లో , ఆంజ‌నేయ ఘాట్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. జ‌ల విద్యుత్ కేంద్రానికి వెళ్లే దారిలో బారికేడ్ల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ‌

సాగర్ 8 గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్ కు ఎగువ నుంచి ఇన్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 1,66,822 క్యూసెక్కు ల నీరు వస్తుండడంతో సాగర్ ఎనిమిది గేట్లను పది ఫీట్ల మేర ఎత్తి 1,19,784 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.80 అడుగుల మేర 311.4474 టీఎంసీల నీరుంది. కుడికాల్వకు 7,828 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,022, పవర్ ప్లాంట్ కు 28,785, ఎస్ ఎల్ బీసీకి 2,400 క్యూసెక్కు ల నీటిని రిలీజ్ చేస్తున్నారు.