ORR పై నో పార్కింగ్ ..ఐఆర్ బీ గోల్కొండ ఎక్స్‌‌ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రచారం

ORR పై నో పార్కింగ్ ..ఐఆర్ బీ గోల్కొండ ఎక్స్‌‌ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రచారం
  • అవగాహనతో ప్రమాదాలు నివారిస్తం
  •     పోస్టర్ ​ఆవిష్కరణలో డైరెక్టర్ అమితాబ్​ మురార్క   

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఔట‌‌ర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల‌‌ను నివారించేందుకు ‘ఓఆర్ఆర్‌‌పై నో పార్కింగ్’ అనే ప్రచారానికి ఐఆర్​బీ గోల్కొండ ఎక్స్‌‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ప్రచారం చేపట్టింది. ప్రస్తుతం ఓఆర్ఆర్ పై టోల్​వసూళ్ల లీజును ఈ సంస్థనే కలిగి ఉంది. ప్రమాదాన్ని సూచించే లైట్లు లేదా రిఫ్లెక్టివ్ వార్నింగ్ ప‌‌రిక‌‌రాలు ఏవీ లేకుండానే భారీ వాహ‌‌నాల‌‌ను పార్క్​చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతుండడంతో హెచ్ఎండీఏ, ట్రాఫిక్ పోలీసులు, హైద‌‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ తో క‌‌లిసి నెల‌‌ రోజుల ప్రచారాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా నో పార్కింగ్​పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఆర్‌‌బీ గోల్కొండ ఎక్స్‌‌ప్రెస్ వే  డైరెక్టర్ అమితాబ్​ మురార్క మాట్లాడుతూ.. ప్రచారంలో భాగంగా డ్రైవ‌‌ర్లకు అవ‌‌గాహ‌‌న కార్యక్రమాలు, డిజిట‌‌ల్ ప్రచారాలు, వాణిజ్య డ్రైవ‌‌ర్లు, లాజిస్టిక్ సంస్థల నిర్వాహ‌‌కులు, ప్రైవేటు వాహ‌‌నాల య‌‌జ‌‌మానుల‌‌తో సెష‌‌న్లు నిర్వహిస్తామన్నారు.