గణేశుడి ఉత్సవాలకు నో పర్మిషన్..

గణేశుడి ఉత్సవాలకు నో పర్మిషన్..

మండపాలు ఏర్పాటు చేయవద్దని పోలీస్ శాఖ ఆదేశాలు
విగ్రహాలు తయారు చేయవద్దని వినతి
కరోనా కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం

వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ని వీధివీధినా సందడి నెలకొంటుంది. పెద్ద ఎత్తున మండపాలు ఏర్పాటు చేసి అందులో విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో నవరాత్రుల కోసం వీధుల్లో మండపాలు ఏర్పాటు చేయొద్దని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న వినాయక చవితి కాగా, ఇప్పటికే పట్టణాల్లో విగ్రహాల తయారీ జరుగుతోంది.

మరోవైపు మండపాలు ఏర్పాటు చేసేందుకు గణేష్ ఉత్సవ కమిటీలు సమాయత్తమవుతున్నాయి. అయితే కరోనా వైరస్ తో ఇప్పటికే జనజీవనం గందరగోళంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే వైరస్ మ‌రింతగా వ్యాప్తిచెందే ప్రమాదముందని భావించిన పోలీస్ శాఖ ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు కరోనా వ్యాప్తి నియంత్రణకు సహరించాలని, ఈ ఏడాది వేడుకలను ప్రజలంతా ఇళ్లలోనే నిర్వహించుకోవాలని కోరింది. విగ్రహాల తయారీ కూడా మానుకోవాలని, వాటిని తయారు చేసి ఇబ్బందులు పడొద్దని అధికారులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం