MS Dhoni: ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు బ్రేక్.. సీఎస్‌కే సీఈఓ బిగ్ అప్డేట్

MS Dhoni: ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు బ్రేక్.. సీఎస్‌కే సీఈఓ బిగ్ అప్డేట్

MS Dhoni: గత కొంతకాలంగా మహేంద్ర సింగ్ ధోని రిటైర్మింట్ చేస్తారనే ఊహాగానాలకు బ్రేక్ పడింది. మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైతున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో కూడా ధోనీ ఆడబోతున్నారని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సీఈఓ కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు. కాగా ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ కెరీర్‌లో అతడు మొత్తం 235 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా, 136 విజయాలు సాధించారు. ధోని కెప్టెన్సీ విజయం శాతం 57.87గా ఉంది. 

ఐపీఎల్ ఆరంభం నుంచే చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉన్న ధోనీ, ఫ్రాంచైజీకి ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. ఈ ఐదు ట్రోఫీలు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ధోనీ కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించినప్పటికీ, ఆటగాడిగా మాత్రం జట్టుతోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు 2026 సీజన్‌లోనూ అతని అనుభవం సీఎస్‌కేకు కీలకంగా మారనుంది.

అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో సీఎస్‌కే మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కే కీలక మార్పులు చేసింది. సంజూ శాంసన్‌ను రూ.18 కోట్ల జట్టులోకి తీసుకుంది. అదే సమయంలో రవీంద్ర జడేజా (రూ.14 కోట్లు), సామ్ కరన్ (రూ.2.4 కోట్లు) ట్రేడ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లారు. రాహుల్ చాహర్, అకీల్ హోసైన్, మ్యాట్ హెన్రీ, మ్యాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి అనుభవజ్ఞులతో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లపై ఒక్కొక్కరికి రూ.14.2 కోట్లతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. పూర్తి షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ధోనీ మరోసారి మైదానంలోకి దిగనుండటంతో, సీఎస్‌కే అభిమానుల్లో ఉత్సాహం మరోసారి పిక్స్ కు చేరింది.