మిలటరీని మోహరిస్తే మాత్రం ఊకోం

మిలటరీని మోహరిస్తే మాత్రం ఊకోం

అష్గాబాత్: ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరితే తమకేం అభ్యంతరం లేదని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. బుధవారం తుర్కమెనిస్తాన్ రాజధాని అష్గాబాత్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరితే మాకేం సమస్య లేదు. ఉక్రెయిన్ తో ఉన్నట్లుగా ఆ దేశాలతో భౌగోళికంగా మాకేం ఇబ్బందులు లేవు. వాళ్లు ఎందులో చేరాలనుకుంటే అందులో చేరొచ్చు. కానీ అక్కడ మిలటరీని మోహరిస్తే మాత్రం ఊకోం. మమ్మల్ని బెదిరించాలని చూస్తే, మేమూ బెదిరింపులకు దిగుతాం” అని పుతిన్ స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించడంతో నాటోలో చేరాలని ఫిన్లాండ్, స్వీడన్  నిర్ణయించాయి. బుధవారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరిగిన నాటో దేశాల సదస్సులో ఈ ప్రక్రియను ప్రారంభించాయి.
   
వాళ్లు బట్టలిప్పితే అసహ్యంగుంటది..  
జీ7 సమ్మిట్ సందర్భంగా తనపై జోక్ వేసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు పుతిన్ కౌంటర్ ఇచ్చారు. తాము పుతిన్ కంటే బలంగా ఉన్నామని జీ7 దేశాధినేతలూ బట్టలు విప్పి చూపించగలరని జాన్సన్ అన్నారు. పుతిన్ షర్ట్ లేకుండా దిగిన ఫొటోను ఉద్దేశించి కామెంట్ చేశారు. అయితే వాళ్లు బట్టలు లేకుండా అసహ్యంగా ఉంటారని పుతిన్ కౌంటర్ ఇచ్చారు.