ఏడు ఎమ్మెల్సీల్లో ఒక్కటి కూడా రెడ్డి కోటాలో ఇవ్వలేదు : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

ఏడు ఎమ్మెల్సీల్లో ఒక్కటి కూడా రెడ్డి కోటాలో ఇవ్వలేదు : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో గత మూడేండ్లలో భర్తీ చేసిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్కటి కూడా రెడ్డి కోటాలో ఇవ్వలేదని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెలమ వర్గాలకే ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని తెలిపారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి విడతలో మహేశ్ గౌడ్, బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌కు, రెండో దశలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి, మూడో దశలో గవర్నర్ కోటాలో అజారుద్దీన్, తెలంగాణ ఉద్యమకారుడి కోటాలో కోదండరామ్‌‌‌‌‌‌‌‌కు అవకాశం కల్పించారని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాలో ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ, యూత్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో పనిచేసిన సామ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డికి జెన్‌‌‌‌‌‌‌‌జీ కోటాలో అవకాశం ఇచ్చినట్టు వివరించారు.