
చేవెళ్ల, వెలుగు : ప్రశాంతమైన చేవెళ్ల కావాలా.. రక్త పుటేరులు పారే చేవెళ్ల కావాలా.. ప్రజలే నిర్ణయించుకోవాలని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి భీమ్ భరత్ పై ఉన్న కేసులు రివార్డులా.. పద్మశ్రీ అవార్డులా ? అనేది చూడాలని విజ్ఞప్తి చేశారు. శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు, టంగుటూరు,ఎల్వర్తి, చందిప్ప, ఏర్వగూడ, మాసాని గూడ, కొత్తపల్లి, జన్వాడ తదితర గ్రామాల్లో ఆదివారం ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ..--‘ నేరస్తుడికి ఓటేస్తే చేవెళ్ల ప్రజలకు భద్రత, శాంతి ఉండదని, భూములు, ఆస్తులు ఖతం అని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తుందని ప్రజలు ఒకసారి ఆలోంచించాలని సూచించారు. పదవుల కోసం పార్టీ మారే నాయకుడికి ఓట్లడిగే హక్కు లేదని బీజేపీ అభ్యర్థిపై విరుచుకుపడ్డారు.
కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీలు విజయలక్ష్మి, సెగ్మెంట్ మాజీ ఇన్చార్జ్ దేశమోళ్ల ఆంజనేయులు, చేవెళ్ల జెడ్పీటీసీ మర్పల్లి మాలతీ, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, సర్పంచ్ జంగారెడ్డి , పలు గ్రామాల సర్పంచులు భీమయ్య, మల్లారెడ్డి, నడిమొళ్ల లావణ్యశంకర్, నరహరి రెడ్డి, జంగారెడ్డి, పద్మ ప్రభాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేశం గుప్తా, ఎంపీటీసీలు బక్కారెడ్డి రవీందర్రెడ్డి, సర్పంచ్లు శేరి శివారెడ్డి, భాను కుమార్,సులోచన అంజనేయులు గౌడ్, ఆలూరు విజయలక్ష్మీ నర్సింలు, సత్యనారాయణ చారి, మాజీ ఎంపీపీ బాల్ రాజు, మాజీ మండల అధ్యక్షుడు రమేశ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మల్గని నరేందర్ గౌడ్, మైనార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.