యాదాద్రి భువనగిరి: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భువనగిరి పట్టణానికి చెందిన రెండు వేల మంది ఆటో డ్రైవర్లుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యావసర సరుకులు పంపించారు. ఆ పంపిణీ కాస్తా రసాభాసగా మారింది. నిత్యావసర సరుకులతో వచ్చిన డిసిఎం పైకి ఎక్కి ఎవరికి వారు ఇష్టారాజ్యంగా సామాజిక దూరం, మస్కులు లేకుండా నిత్యావసర సరుకులు లూటీ చేశారు ఆటో డ్రైవర్లు. వీరి తీరును చూసిన పోలీసులు లాఠీకి పని చెప్పారు. ఈ సంఘటన మంగళవారం భువనగిరిలో జరిగింది.
వివరాలు
యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరిలోని ఆటో డ్రైవర్లు, ఆశావర్కర్లు,ప్రవేట్ టీచర్లు, జర్నలిస్టులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని.. స్థానికంగా ఉండే భువనగిరి పట్టణ కౌన్సిలర్ల కు అప్పగించారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేశారు. అది కాస్తా రసాభాసగా మారింది. నిత్యావసర సరుకులతో వచ్చిన డిసిఎం చూసిన ఆటో డ్రైవర్లు ఒక్కసారిగా డిసిఎం వాహనం మీద పడి ఇష్ట వచ్చినట్లు నిత్యావసర సరుకులను ఎత్తుకెళ్లారు. సామాజిక దూరం , మస్కులు లేకుండా వచ్చిన ఆటో డ్రైవర్ల తీరును చూసిన పోలీసులు.. ఆటో డ్రైవర్ల పైన లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు.
