ప్రైమరీ కాంటాక్ట్‌లకు కూడా టెస్టులు చేస్తలేరు

ప్రైమరీ కాంటాక్ట్‌లకు కూడా టెస్టులు చేస్తలేరు
  • ఇబ్రహింపట్నంలో కరోనా అనుమానితుల ఆవేదన
  • నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బంది

హైదరాబాద్‌: కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కూడా టెస్టులు చేస్తలేరని ప్రజలు ఆరోపిస్తున్నరు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో టెస్టులు నిలిపేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులు మాత్రమే యాంటీజన్‌ టెస్టులు నిర్వహించారని, ఆ తర్వాత నుంచి ఆపేశారని అన్నారు. అనుమానితులు, ప్రైమరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేయాలని కోరితే వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని స్థానికులు అన్నారు. కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పినా లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టులు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.