ప్రపంచ బులియన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన చైనీస్ బిలియనీర్ ట్రేడర్ బియాన్ జిమింగ్.. ఇప్పుడు వెండి మార్కెట్‌పై గురిపెట్టారు. 2022 నుండి షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్‌లో బంగారంపై చేసిన బెట్టింగ్‌ల ద్వారా దాదాపు 3 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.27వేల కోట్ల లాభాన్ని ఆర్జించిన ఆయన.. ఇప్పుడు వెండి ధరలు పతనమవుతాయని భారీ షార్ట్ పొజిషన్ తీసుకున్నాడు. ప్రస్తుతం వెండి మార్కెట్‌లో ఆయన పెట్టిన పందెం విలువ సుమారు 300 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.2వేల 700 కోట్లని తేలింది.
ALSO READ : శుక్రవారం మళ్లీ తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్..
బియాన్ జిమింగ్ సామాన్య వ్యక్తి కాదు. చాలావరకు వార్తల్లో హైలైట్ కాకుండా జిబ్రాల్టర్ వంటి ప్రాంతాల్లో గడుపుతూ.. చైనా కమోడిటీ మార్కెట్‌ను శాసిస్తున్న కొద్దిమంది ప్రభావవంతమైన ట్రేడర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు. తాజాగా వెండి ధరలు విపరీతంగా పెరగడం ఆర్థిక ప్రాతిపదికన కాకుండా కేవలం స్పెక్యులేషన్ వల్లే జరుగుతోందని ఆయన భావించారు. అందుకే ధరలు పడిపోతాయని అంచనా వేస్తూ దాదాపు 450 టన్నుల వెండికి సమానమైన 30వేల కాంట్రాక్టులను షార్ట్ చేశారు.
గత వారం నుంచి వెండి ధరల్లో వచ్చిన భారీ తగ్గుదల బియాన్ వ్యూహానికి బలాన్ని ఇచ్చింది. కేవలం మంగళవారం ముగింపు ధరల ప్రకారం చూస్తే.. ఆయనకు దాదాపు 100 కోట్ల రూపాయల నికర లాభం వచ్చింది. గురువారం ట్రేడింగ్‌లో వెండి ధరలు మరో 16 శాతం మేర పడిపోవడంతో ఆయన లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ట్రేడింగ్ అంతా ఆయనకు చెందిన జోంగ్‌కై ఫ్యూచర్స్ బ్రోకరేజ్ సంస్థ ద్వారా జరుగుతోంది. అయితే ఈ ప్రయాణం అంత సులభంగా ఏమీ సాగలేదు. జనవరి చివరి వారంలో ఆయన బెట్టింగ్ ప్రారంభించినప్పుడు.. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల కొన్ని పొజిషన్లలో నష్టాలను కూడా చూడాల్సి వచ్చిందట.
ALSO READ : హోం లోన్, పర్సనల్ లోన్, ఆటో అప్పులపై వడ్డీ రేట్లు మారలేదు
బంగారం ధరలు వడ్డీ రేట్లు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లపై ఆధారపడి పెరుగుతుంటే.. వెండి ధరల పెరుగుదల కేవలం పారిశ్రామిక అవసరాల పేరుతో జరుగుతున్న ఆర్టిఫీషియల్ పెరుగుదలగా బియాన్ భావిస్తున్నారు. అందుకే ధరలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో ఆయన తన వ్యూహాన్ని మార్చి సెల్లింగ్ వైపు మొగ్గు చూపారు. బియాన్ జిమింగ్ పెట్టుబడి శైలికి చైనాలో పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నారు. ఆయన ఆన్‌లైన్‌లో పంచుకునే ఇన్వెస్ట్మెంట్ సూత్రాలు, ఆర్థిక తత్వశాస్త్రంపై చాలామంది ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ 'సిల్వర్ షార్ట్' బెట్టింగ్ విజయం సాధిస్తే.. కమోడిటీ మార్కెట్‌లో ఆయన మరోసారి తిరుగులేని ట్రేడర్ అవుతారు. మెుక్కానిరి ఈ బిలియనీర్ ట్రేడర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
