టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ  రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ

టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ  రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ

 తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన కార్యనిర్వహణ అధికారి బాధ్యతలను తెలుగు రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్‌కి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.  

గురువారం ( ఫిబ్రవరి 5)  సాయంత్రం తిరుమల చేరుకున్న  టీటీడీ కొత్త ఈవో  రవిచంద్ర శుక్రవారం ( ఫిబ్రవరి 6) ఉదయం క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరాహస్వామివారిని  దర్శనం చేసుకున్నారు.  అనంతరం  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరిన  ఆయన  .. స్వామి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 

ALSO READ :  శ్రీశైలం ఆలయ ఆవరణలో ప్లాస్టిక్ నిషేధం..

రంగనాయక మండపంలో ఇన్చార్జి ఈవో వెంకయ్య చౌదరి నుంచి అధికార బదిలీ జరిగింది.  కొత్త ఈవోకు ఆలయ అర్చకుల వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.  తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉంటానని ఈవో స్పష్టంచేశారు.