Actor Chandrahas Case: “గుంజీ గుంజీ” పాట వివాదం.. హీరో చంద్రహాస్‌పై మరో కేసు నమోదు!

Actor Chandrahas Case: “గుంజీ గుంజీ” పాట వివాదం.. హీరో చంద్రహాస్‌పై మరో కేసు నమోదు!

బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు, యువ నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదైంది. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆయన పాడిన “గుంజీ గుంజీ” పాట తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో చంద్రహాస్ అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే, ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదు కాగా, లేటెస్ట్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మరో క్రిమినల్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ అసభ్య పదజాలంతో పాటపాడాడు. దీంతో చంద్రహాస్ ఉపయోగించిన భాష సరికాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నితీష్ కుమార్ ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు.

ALSO READ :  విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చంద్రహాస్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం చంద్రహాస్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపోతే, బారాబర్ ప్రేమిస్తా మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. ఇవాళే శుక్రవారం (ఫిబ్రవరి 6న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు సంపత్ రుద్ర డైరెక్ట్ చేయగా, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని నిర్మించారు.