ఎల్‌‌‌‌‌‌‌‌ నినో ముప్పున్నా సాగుకు ఢోకా లేదు..ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

ఎల్‌‌‌‌‌‌‌‌ నినో ముప్పున్నా సాగుకు ఢోకా లేదు..ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: వానాకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, 'ఎల్‌‌‌‌‌‌‌‌నినో' ప్రభావాన్ని తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం సీఎం నిర్వహించిన సమావేశంలో మంత్రి సాగు వివరాలను వెల్లడించారు. ఎల్‌‌‌‌‌‌‌‌నినో వల్ల వర్షాలు ఆలస్యమైనా రైతులు నష్టపోకుండా శాస్త్రవేత్తలు, నిపుణులతో కలిసి ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి చెప్పారు.

వరిపైనే ఆధారపడకుండా కందులు, పెసలు, మినుములు, జొన్నలు, మొక్కజొన్న వంటి పంటల వైవిధ్యీకరణ వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సీజన్ కోసం 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని, జిల్లాల్లో ముందస్తు నిల్వలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతకు 'ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్'లో మార్పులు చేశామని, మీ సేవా కేంద్రాల ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు.

రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జూలై, ఆగస్టుల్లో ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారుల సూచనలు పాటించాలన్నారు.తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం ద్వారా మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రత వివరాలను నేరుగా రైతుల వాట్సాప్‌‌‌‌‌‌‌‌కే పంపుతున్నట్లు మంత్రి తెలిపారు.