
అర్థులంతా అలెర్టయిపోయారు. నామినేషన్లు ముగింపు దశకు చేరడంతో ప్రచారంపై నజర్ పెట్టారు . ప్రచారపర్వానికి తక్కువ రోజులే ఉండడంతో బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తించేందుకు ప్లాన్ చేస్తున్నారు . అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా గ్రామగ్రామం తిరిగి కార్యకర్తలను కలిసేంతసమయం ఈ ఎన్నికలకు లేదు. దీంతో నియోజకవర్గస్థాయి సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు . తక్కువ సమయంలో ఎక్కువమంది పార్టీ నాయకులు, కార్యకర్తలనుకలిసేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలి అన్న అంశాలను స్థానిక కేడర్‌కు వివరించడమే ఈ సమావేశాల ముఖ్యోద్దేశం.
మరోమారు ప్రజలను కలిసే వ్యూహం
అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా పార్టీలఎమ్మెల్యే లు పార్టీ నాయకులే ఇంచార్జీలుగానియమించారు. పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేయాల్సిఉంటుందని చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు మండలాలను, ముఖ్య నాయకులు,కార్యకర్తలకు గ్రామాల బాధ్యతను అప్పజెబుతూ కిందిస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్నిపూర్తిగా ప్రచారంలో పాల్గొనేలా చేస్తున్నారు . మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వా త జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు ప్రచారంలో విస్తృ తంగా తిరిగి ప్రజలను కలిశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మరోమారు గ్రామాలకు వెళ్లేందుకు, ప్రజలనుకలిసి వివరించేందుకు తయారవుతున్నారు .
బరిలో ముగ్గురు
ప్రస్తుతం చేవెళ్ల లోక్ భ స్థానం నుంచి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు హోరాహోరీగా ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. కానీ, బీజేపీ వ్యూహం ఏమీటో తెలియక స్థానిక ఓటర్లుఆయోమయం అవుతున్నారు. బీజేపీ తమ పట్టును నిలుపుకునేందుకు అంతర్గత పోల్ మేనేజ్‌మెంట్‌చేస్తోందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి జనార్దన్ రెడ్డి బరిలోఉన్నారు . ముగ్గురు బలమైననాయకులు, ఒకే సామాజిక వర్గం కావడంతోగెలుపు ఎవరి వైపు ఉంటుం దోననే ఆసక్తి నెలకొంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డిలు స్థానిక ఓటర్లు కావడం విశేషం.