రైలు ఆపకపోతే ఓట్లేయం.. తేల్చి చెప్పిన 18 గ్రామాల ప్రజలు

రైలు ఆపకపోతే ఓట్లేయం.. తేల్చి చెప్పిన 18 గ్రామాల ప్రజలు
  • రైలు ఆపకపోతే ఓట్లేయం
  • గుజరాత్‌‌‌‌‌‌‌‌లో 18 గ్రామాల్లో తీర్మానం

నవసారి: తమ డిమాండ్‌‌‌‌‌‌‌‌ నెరవేరిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేకపోతే వెయ్య మని గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని 18 గ్రామాల ప్రజలు తేల్చి చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తేనే నేతలు ఓట్లు అడగడానికి తమ గ్రామాలకు రావాలని బ్యానర్లు కట్టారు. నవసారి అసెంబ్లీ నియోజకవర్గంలో అంచేలి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఉంది. కరోనాకు ముందు ఆ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో లోకల్‌‌‌‌‌‌‌‌ రైలు ఆగేదని, కరోనా తర్వాత అక్కడ రైలును ఆపడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ వెహికల్స్‌‌‌‌‌‌‌‌లో రూ.300 చార్జి పెట్టి మరో స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఆ ట్రైన్‌‌‌‌‌‌‌‌ను ఎక్కాల్సి వస్తోందని వాపోతున్నారు. దీని వల్ల కాలేజీ స్టూడెంట్లు, ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌, బిజినెస్‌‌‌‌‌‌‌‌ పర్సన్స్‌‌‌‌‌‌‌‌తో పాటు సాధారణ ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంచేలి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌లో లోకల్‌‌‌‌‌‌‌‌ ట్రైన్‌‌‌‌‌‌‌‌ ఆపకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని అంచేలి గ్రామంతో పాటు మరో 17 గ్రామాలు తేల్చి చెప్పాయి.