రష్యా హెల్ప్ చేసిన ఇరాన్‌‌కు నో యూజ్: ట్రంప్‌‌ సంచలన కామెంట్స్‌‌

రష్యా హెల్ప్ చేసిన ఇరాన్‌‌కు నో యూజ్: ట్రంప్‌‌ సంచలన కామెంట్స్‌‌

డోరల్ (అమెరికా): అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకునేందుకు ఇరాన్‌‌తో రష్యా సమాచారాన్ని  పంచుకుంటోందన్న వార్తలను అమెరికా ప్రెసిడెంట్‌‌ డొనాల్డ్ ట్రంప్ తేలికగా తీసుకున్నారు. ఒకవేళ రష్యా అలాంటి ఇంటెలిజెన్స్‌‌ సాయం చేసినా.. దానివల్ల ఇరాన్‌‌కు పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. 

ఇరాన్‌‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత, కువైట్‌‌లో జరిగిన డ్రోన్ దాడిలో ఆరుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పించిన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. రష్యా సమాచారం ఇస్తున్నట్టు వస్తున్న రిపోర్టులను ట్రంప్ ధ్రువీకరించలేదు. అయితే, ‘‘గత వారం రోజులుగా ఇరాన్‌‌కు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. 

ఒకవేళ వారు సమాచారాన్ని పొందుతున్నా, అది వారికి పెద్దగా ఉపయోగపడడం లేదు” అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అమెరికా కూడా ఉక్రెయిన్‌‌కు ఇంటెలిజెన్స్ సాయం చేసిందని, రష్యా కూడా అదే చేస్తున్నదని ట్రంప్ పరోక్షంగా సమర్థించారు. రష్యాతో సంబంధాలపై దీని ప్రభావం ఉండబోదని ఆయన సంకేతాలిచ్చారు.