లాక్‌‌డౌన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు

లాక్‌‌డౌన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు. కరోనా కట్టడికి అధికారులు చేస్తున్న కృషి మరువలేనిదని జిల్లాల కలెక్టర్‌‌లతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్‌‌లో సోమేశ్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర కేసులు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. లాక్‌‌డౌన్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. లాక్‌డౌన్ పనికిరాదని, దాని వల్ల పెద్దగా మార్పులు ఉండవన్నారు. 

ఎంత ఖర్చుకైనా వెనుకాడం
‘కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల్లో కొవిడ్ కంట్రోల్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నాం. 10 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతోంది. మెడిసిన్‌లు, ఆక్సిజన్ కొరత లేదు. రాష్ట్రంలో 52 వేల బెడ్‌‌లు సిద్ధంగా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచేందుకు యత్నిస్తున్నాం. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వారికీ కరోనా ట్రీట్‌మెంట్ జరుగుతోంది. రోజుకు 33 ఎయిర్ అంబులెన్స్‌‌లు నగరానికి వస్తున్నాయి. కరోనా కట్టడి కోసం ఎంతైనా ఖర్చు పెట్టమని సీఎం చెప్పారు. సెకండ్ వేవ్‌‌లో వైరస్ వేగంగా వ్యాప్తి అవుతోంది. కాబట్టి అవసరం లేకపోతే బయట తిరగొద్దు. లక్షణాలు ఉన్న వారికి వెంటనే ట్రీట్‌‌మెంట్ అందించాలి. లక్షణాలను త్వరగా గుర్తించి, సరైన సమయానికి మెడిసిన్స్ వేసుకుంటే కరోనా నుంచి సులువుగా బయటపడొచ్చు’ అని సీఎస్ చెప్పారు.  

అన్నీ ఉన్నాయి.. బేఫికర్
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర కరోనా అదుపులో ఉందని సీఎస్ చెప్పుకొచ్చారు. లిక్విడ్ ఆక్సిజన్, వెంటిలేటర్‌‌లు, బెడ్‌‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో 12 వేల బెడ్లు ఉండేవని, ఇప్పుడు 52 వేల బెడ్‌‌‌లు ఉన్నాయని చెప్పారు. మాస్కులు, ppe కిట్ లు,ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్‌‌లు కూడా ఉన్నాయని.. పాజిటివ్ వచ్చిన వాళ్లకు హెల్త్ కిట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రెమిడిసివర్, టోసిలి జిమీబివర్ కూడా మనకు కావాల్సినవన్ని ఉన్నాయని, ప్రతి జిల్లాలో ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు కూడా చేస్తున్నామన్నారు.

సొంత వైద్యం వద్దు
‘జనాలు చాలా మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. లక్షణాలు ఉన్న వారు 5 రోజులు ప్యారసిటమాల్ మందులు వాడండి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌‌సీల్లో కొవిడ్ ఔట్ పేషంట్‌‌ సేవలను స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక హెల్త్ టీమ్ ఉంటుంది. ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్స్ ఉంటారు. లక్షణాలను బట్టి టాబ్లెట్‌‌లు ఇస్తారు. జాగ్రత్తగా ఉండండి. సమస్య నుంచి త్వరలో బయటపడతాం’ అని సీఎస్ ధీమా వ్యక్తం చేశారు.