మహారాష్ట్ర ప్రభుత్వం స్కూల్ పిల్లల ఆరోగ్యం కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల చుట్టుపక్కల వడా పావ్, సమోసాలు, చాక్లెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ అమ్మడాన్ని పూర్తిగా నిషేధించింది. పిల్లల్లో చిన్న వయసులోనే ఒబెసిటీ, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడటమే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిషేధం ఎక్కడంటే.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లు అలాగే వాటికి 50 మీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ నిబంధన కచ్చితంగా అమల్లో ఉంటుంది. దింతో సుమారు 1.08 లక్షల స్కూల్స్ పై ఈ ప్రభావం పడనుంది.
ఏవి బ్యాన్ చేశారంటే :
నూనెలో వేయించిన వడా పావ్, సమోసాలు, చిప్స్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్ వంటి కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌ను విక్రయించడానికి బ్యాన్ చేసారు.
స్కూల్ క్యాంటీన్లకు కూడా రూల్స్: స్కూల్ క్యాంటీన్లు, హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందించే ప్రదేశాలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ తప్పనిసరి చేశారు. దింతో ఇక పిల్లలకు పరిశుభ్రమైన, పోషకాహారం మాత్రమే అందేలా చూసే బాధ్యత స్కూల్ ప్రిన్సిపాల్స్, మేనేజ్‌మెంట్‌దే.
ఉల్లంఘిస్తే చర్యలు: ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే స్కూళ్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు, లైసెన్సులు రద్దు చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) హెచ్చరించింది
