ప్రైజ్ తీసుకొని.. తప్పుచేశానని ఒప్పుకుంది..

ప్రైజ్ తీసుకొని.. తప్పుచేశానని ఒప్పుకుంది..

రీసెర్చ్​ పేపర్​ను వెనక్కు తీసుకున్న నోబెల్​ విన్నర్​

ఆమె నోబెల్​ ప్రైజ్​ విన్నర్​. కెమిస్ట్రీలో ఆమె చేసిన సేవలకు గాను 2018లో నోబెల్​ ప్రైజ్​ వచ్చింది. కానీ, ఆమె తన రీసెర్చ్​లో తప్పు చేశారు. దీంతో సారీ చెప్పి, గత ఏడాది పబ్లిష్​ అయిన ఆ రీసెర్చ్​ను వెనక్కు తీసుకున్నారు. ఆమె డాక్టర్​ ఫ్రాన్సిస్​ ఆర్నాల్డ్​. ఎవల్యూషన్​ ఆఫ్​ ఎంజైమ్స్​పై చేసిన పరిశోధనలకు గాను మరో ఇద్దరు కెమిస్ట్రీ సైంటిస్టులతో కలిసి ఆమె నోబెల్​ అందుకున్నారు. గత ఏడాది ‘ఎంజైమాటిక్​సింథసిస్​ ఆఫ్​ బీటా లాక్టమ్స్​ (యాంటీబయాటిక్స్​)’ అనే పేపర్​ను ఆమె సబ్​మిట్​ చేశారు. అయితే, ఇప్పుడు ఆ పేపర్​నే ఆమె వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్​లో ఆ విషయాన్ని వెల్లడించారు. ‘‘తప్పును ఒప్పుకోవడం చాలా కష్టమైన పనే. కానీ, తప్పదు. నేను తప్పు చేశా. నా రీసెర్చ్​లో తప్పు దొర్లింది. అందరికీ సారీ. పేపర్​ పబ్లిష్​ అయినప్పుడు నేను తీరిక లేని పనుల్లో ఉన్నాను. నేను నా రీసెర్చ్​ను సరిగ్గా చేయలేదు” అని ట్వీట్​ చేశారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్న ఆమె నిజాయితీని పలువురు సైంటిస్టులు మెచ్చుకుంటున్నారు. ఓ సైంటిస్ట్​ నిజాయితీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఈ ఘటన చెబుతుందని కొనియాడుతున్నారు. ప్రపంచానికి ఓ నోబెల్​ విన్నర్​ మంచి పాఠాన్ని నేర్పిందంటున్నారు. తప్పుల నుంచి నేర్చుకుంటూ ట్రాన్స్​పరెంట్​గా ఎలా ఉండాలో చెప్పారన్నారు.