
టాయిలెట్‌కు వెళ్లటం కామన్.. టాయిలెట్ సీటుపై కూర్చోవటం వెరీ కామన్.. అలాంటి టాయిలెట్ సీటు పేలిపోతుంది.. పెద్ద శబ్ధంతో టాయిలెట్ సీటు పేలిపోవటం.. మంటలు రావటం ఏంటీ.. ఆ సీటుపై కూర్చున్న వ్యక్తి 35 శాతం గాయపడ్డాడు.. అసలు టాయిలెట్ సీటు పేలిపోవటం అనేది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇలా ఎలా జరుగుతుంది.. ఎందుకు జరిగింది.. దీనికి కారణం ఏంటీ అనేది అందరిలో ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే మనిషి అన్నాక టాయిలెట్ సీటుపై కూర్చోవటం కామన్ కదా..
ప్రభాస్ నటించిన యోగి సినిమాలో బాత్రూమ్లో బ్లాస్ట్ జరిగి కమెడియన్ వేణు మాధవ్ బ్యాక్ సైడ్ అంతా కాలిపోతుంది గుర్తింది కదా.. సరిగ్గా ఇలాంటి సీనే ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. బాత్ రూమ్‌లో భారీ పేలుడు చోటుచేసుకోవడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల ప్రకారం.. గ్రేటర్ నోయిడా సెక్టార్ 36లో అషు (20) అనే యువకుడు ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు.
రోజు మాదిరిగానే ఉదయం లేవగానే అషు తన ఇంట్లోని వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్‌కు వెళ్లాడు. లోపలికి వెళ్లి ఫ్లష్ బటన్ నొక్కిగానే టాయిలెట్ సీటు పెద్ద శబ్దంతో పేలిపోయింది. వెంటనే మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో అషు ముఖం, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. టాయిలెట్లో భారీ పేలుడుతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. వెంటనే గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)కు బాధితుడిని తరలించారు. అషుకు 35% కాలిన గాయాలు అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే.. టాయిలెట్లో మొబైల్ ఉపయోగించడంతోనే ఈ బ్లాస్ట్ జరిగినట్లు స్థానికులు అంటుండగా.. వీటిని బాధితుడి తండ్రి తోసిపుచ్చారు. ఆ సమయంలో అషు బాత్ రూమ్ లోకి ఫోన్ కానీ మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరం కానీ తీసుకువెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న మురుగు మూసుకుపోవడం వల్ల టాయిలెట్ బౌల్ లోపల మీథేన్ వాయువు పేరుకుపోయి ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అన్నారు. ఈ ఘటనపై స్థానికవాసి హరీందర్ భాటి స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
►ALSO READ | టర్కీ, అజార్ బైజాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. రెండు దేశాలతో CAIT వాప్యార సంబంధాలన్నీ కట్
ఈ ప్రాంతంలో డ్రైనేజీ పైపులు పాతవి. అంతేకాదు వాటిని సంవత్సరాలుగా శుభ్రం చేయలేదు. మూసుకుపోయిన పైపులు మీథేన్ వంటి ప్రమాదకరమైన వాయువులు పేరుకుపోవడానికి దారితీశాయని అన్నారు. గ్రేటర్ నోయిడా అథారిటీ సీనియర్ మేనేజర్ ఏపీ వర్మ మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలోని మురుగునీటి మౌలిక సదుపాయాలను అధికారికంగా తనిఖీ చేశామని.. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ శుభ్రంగా ఉందని పేర్కొన్నారు. అధికారుల వైఫల్యమేమి లేదన్నారు. మొత్తానికి బాత్ రూమ్‌లో బ్లాస్ట్ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.