ఏ కాలంలో ఉన్నాం : పనిష్మెంట్ కింద పిల్లల జుట్టు కత్తిరించిన టీచర్

ఏ కాలంలో ఉన్నాం : పనిష్మెంట్ కింద పిల్లల జుట్టు కత్తిరించిన టీచర్

నోయిడాకు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు.. డజను మంది విద్యార్థులపై క్రమశిక్షణా చర్యగా వారి జుట్టును కత్తిరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. టీచర్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను అధికారులు.. విధుల నుంచి తొలగించినట్టు పోలీసులు వెల్లడించారు.

సెక్టార్ 168లో ఉన్న శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ లో జూలై 6న ఈ ఘటన జరగడంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు స్కూల్ డిసిప్లెన్ ఇన్ ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చాలా రోజులుగా విద్యార్థులను జుట్టు కత్తించుకోమని వారు వినకపోవడంతో.. క్రమ శిక్షణ పేరుతో స్వయంగా ఆమెనే వారి జుట్టును కత్తిరించింది.

Also Read :- ఆస్తి గొడవలు.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు

ఘటన అనంతరం సుమారు 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంతో చర్చకు దిగారు. అనంతరం ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.