కాంగ్రెస్ నేత తుమ్మర్‌‌పై ..నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్

కాంగ్రెస్ నేత తుమ్మర్‌‌పై ..నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్

గాంధీనగర్ :  ప్రధానిపై అనుచిత కామెంట్ల నేపథ్యంలో  కాంగ్రెస్ మాజీ ఎంపీ విర్జీ తుమ్మర్‌‌పై నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్(వారెంట్‌‌తో మాత్రమే అరెస్టు చేసే అధికారం) నమోదు చేసినట్లు అమ్రేలి పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ నెల 22న గుజరాత్‌‌లోని అమ్రేలీ జిల్లాలో  కాంగ్రెస్ పార్టీ 'స్నేహ్ సంవాద్' కార్యక్రమం నిర్వహించింది. దానికి విర్జీ తుమ్మర్‌‌ హాజరై, మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీని దలాల్ (బ్రోకర్)  అని కామెంట్ చేశారు. దీనిపై బీజేపీ అమ్రేలీ జిల్లా విభాగం ప్రధాన కార్యదర్శి మెహుల్ ధోరాజియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విర్జీ తుమ్మర్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విర్జీ తుమ్మర్‌‌ మీడియాతో మాట్లాడుతూ.."ఎవరినీ కించపరచడం నా ఉద్దేశం  కాదు. అవినీతిని ప్రశ్నించినందుకే అధికార బీజేపీ నన్ను టార్గెట్ చేసింది" అని పేర్కొన్నారు.