గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి నాన్ కోవిడ్ సేవలు

V6 Velugu Posted on Aug 02, 2021

కరోనా వైరస్ వ్యాప్తి పీక్స్ లో ఉన్నప్పుడు పూర్తిగా గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు మాత్రమే ట్రీట్మెంట్ అందించారు డాక్టర్లు. మొదటి వేవ్‌ తగ్గిన తర్వాత నాన్‌ కోవిడ్‌ సేవలు ప్రారంభించినా.. మళ్లీ సెకండ్‌ వేవ్‌ పంజా విసరడంతో.. కోవిడ్‌ సేవలకే పరిమితం అయ్యింది.ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖ పట్టాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. రేపటి(మంగళవారం) నుంచి మళ్లీ సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. కరోనా కారణంగా నిలిపివేసిన అన్ని రకాల సాధారణ వైద్య సేవలను మంగళవారం నుంచి పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు డాక్టర్లు.

Tagged Tomorrow, Gandhi Hospital, non-COVID services

Latest Videos

Subscribe Now

More News