100 కోట్ల వ్యూస్ సాధించిన ఐటం సాంగ్

100 కోట్ల వ్యూస్ సాధించిన ఐటం సాంగ్

బాలీవుడ్ ఐటం గర్ల్ నోరా ఫతేహీ నటించిన దిల్బర్ సాంగ్ యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దాంతో ఆమె 100 కోట్ల వ్యూస్ సాధించిన మొదటి ఆఫ్రికన్-అరబ్ యాక్టర్‌గా నిలిచింది. ఈ సక్సెస్‌ని నోరా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ముంబైలోని టీ-సిరీస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి తన విజయాన్ని అందరితో కలిసి పంచుకుంది. అక్కడ చిన్నపిల్లలతో ఏర్పాటు చేసిన ఫ్లాష్ మాబ్‌లో వారితో కలిసి డ్యాన్స్ చేసింది. రికార్డు సృష్టించిన ఈ రీమిక్స్ సాంగ్ 2018లో వచ్చిన సత్యమేవ జయతే సినిమాలోది. దిల్బర్ పాట విడుదలైన మొదటి 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 21 మిలియన్ల వీక్షణలను చేరుకుంది. ఇండియాలో ఈ ఘనత సాధించిన మొదటి హిందీ పాటగా ఈ సాంగ్ నిలిచింది.

దీనిపై స్పందించిన నోరా.. ‘ఈ సాంగ్ 100 కోట్ల వ్యూస్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజును నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇదంతా ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది’ అని ఆమె అన్నారు.