నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి .. ఎండ, హీట్​వేవ్స్​కు అల్లాడుతున్న జనం

నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి ..  ఎండ, హీట్​వేవ్స్​కు అల్లాడుతున్న జనం
  • ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడి గాలులు
  • 24 గంటల్లో బిహార్​లో 22 మంది మృతి
  • ఢిల్లీలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు ఎక్కువ
  • సగటున 45 డిగ్రీల టెంపరేచర్ నమోదు

హీట్​వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్​లో వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఈ మేరకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నార్త్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో యావరేజ్​గా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్​లోనూ ఎండలు దంచికొడ్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎండలు, ఉక్కపోత కారణంగా బిహార్ స్టేట్​లో 22 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో సగటున 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ:  నార్త్ ఇండియా హీట్ వేవ్స్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్​లో వేడి గాలుల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేశామని చెప్పారు. నార్త్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో 46 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్​లోనూ ఎండలు దంచికొడ్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎండలు, ఉక్కపోత కారణంగా బిహార్ స్టేట్​లో 22 మంది చనిపోయారు. రాజధాని ఢిల్లీలోనూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. 50 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యిందేమో అన్న ఫీలింగ్.. ఢిల్లీవాసుల్లో కలుగుతున్నది. ఢిల్లీలో సగటున 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు.

నేటి నుంచి ఢిల్లీలో మోస్తరు వర్షాలు

జూన్​లో నమోదు కావాల్సిన నార్మల్ టెంపరేచర్​తో పోలిస్తే ఢిల్లీలో 6 డిగ్రీలు అధికంగా రికార్డ్ అవుతున్నదని ఐఎండీ అధికారులు వివరించారు. సోమవారం ఎండ, హ్యుమిడిటీ కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ నుంచి బెంగాల్​కు వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ సాంకేతిక సమస్యల కారణంగా మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. టెక్నికల్ సమస్య ఏర్పడటానికి కారణం ఎండ తీవ్రతేనని ఎయిర్​పోర్టు అధికారులు ప్రకటించారు. వేడి కారణంగా రన్ వే కూడా మండిపోతున్నదని తెలిపారు. గత వారం రోజులుగా ఢిల్లీ పరిస్థితి ఇలాగే ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, బుధవారం నుంచి హీట్​వేవ్స్​తో పాటు ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన 
వర్షాలు కురిసే చాన్స్​ ఉందన్నారు. అయితే, ఇది తాత్కాలిక ఉపశమనమే అని చెప్తున్నారు.

ప్రయాగ్​రాజ్​లో 47.6 డిగ్రీలు

ప్రయాగ్​రాజ్​లో సోమవారం రికార్డు స్థాయిలో 47.6  డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఉత్తరాఖండ్​లోని టూరిస్ట్ ప్లేస్ డెహ్రాడూన్​లోనూ ఎండలు దంచికొడ్తున్నాయి. ఇక్కడ సగటున 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. ముస్సోరిలో 43 డిగ్రీలు రికార్డ్ అవుతున్నది. హిల్ టౌన్స్ పౌరీ, నైనిటాల్​లోనూ ఎండ తీవ్రతతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. మూడు నెలలుగా ఇక్కడ చుక్క వర్షం పడలేదు. ఎప్పుడూ చల్లగా ఉండే హిమాచల్​ప్రదేశ్ కూడా ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నది. ఇక్కడ 44 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. సగటు ఉష్ణోగ్రత కంటే 6.7 డిగ్రీలు ఎక్కువ రికార్డ్ అవుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్, కాంట్రాలోనూ ఎండలు దంచికొడ్తున్నాయి. ఇక్కడ 40.8 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. జమ్మూలో ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలకు టచ్ అయింది. రాజస్థాన్​లోని గంగానగర్​లో అత్యధికంగా 46.2 డిగ్రీలు రికార్డయింది. కాగా, ఈస్టర్న్ రాజస్థాన్​లోని పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి ఆదివారం పొద్దున వరకు మోస్తరు వర్షాలు కురిశాయి. కానీ.. బికనీర్, జైపూర్, కోటా, జోధ్​పూర్, అజ్మీర్ డివిజన్లలో వడగాలులు వీస్తున్నాయి.

ఢిల్లీలో పీక్​కు చేరిన పవర్ డిమాండ్

ఎండల కారణంగా ఢిల్లీలో పవర్ డిమాండ్ పీక్​కు చేరింది. మంగళవారం రికార్డు స్థాయిలో 8,647 మెగావాట్ల వినియోగం జరిగిందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ తెలిపింది. ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వాడకమే దీనికి కారణమని చెప్పింది. 2024, మే 22న ఫస్ట్​ టైమ్ 8వేల మెగావాట్ల డిమాండ్ క్రాస్ అయింది.  దీనికి ముందు 2022, జూన్​ 29న 7,695 మెగావాట్లు, 2023లో 7,438 మెగావాట్ల కరెంట్ వినియోగం జరిగింది. మొత్తం 8 సార్లు 8 వేల మెగావాట్ల మార్క్​ను దాటింది. ఢిల్లీలో పవర్ డిమాండ్ సాధారణంగా జూన్ చివర లేదంటే జులై ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. నిరుడు ఆగస్టులో హైయ్యెస్ట్ లెవల్ దాటింది.