ఉత్తర కొరియా కిమ్ కు రష్యా అధ్యక్షుడి గిఫ్ట్

ఉత్తర కొరియా కిమ్ కు రష్యా అధ్యక్షుడి గిఫ్ట్

ఉత్తర కొరియా, రష్యా దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. సెప్టెంబర్ మీటింగ్ వల్ల ఇరు దేశాల దౌత్య సంబంధాలు బలపడ్డాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలు సహాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమితి నుంచి ఆరోపణలు కూడా ఎదుర్కోంది. రష్యా, ఉత్తర కొరియా ల ఫ్రెండిషిప్ మరింత బలపడేందుకు రెండు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18న  ఓ కారును ఫుతిన్ కిమ్ కు బహుమతిగా పంపించాడు. 

ఆ కారును గిఫ్ట్ గా అంగికరిస్తున్నట్లు ఉత్తర కొరియా మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కిమ్ సోదరి ఈ విషయంపై స్పందిస్తూ ఫుతిన్ కు థాంక్స్ చెప్పింది. ఈ గిఫ్ట్ ఇరు దేశాల మధ్య ఉన్న స్పెషల్ రిలేషన్ షిప్ కు గుర్తింపు అని అన్నారు. రష్యా తయారు చేసిన ఆ కారు స్పెసిఫికేషన్స్, ట్రాన్స్ పోర్ట్ వివరాలు బయటకు తెలియ పరచలేదు. కిమ్ కు ఆటో మొబైల్, లగ్జరీ కార్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో యూఎన్ భద్రతా మండలి ఉత్తర కొరియాకు లగ్జరీ వస్తువుల ఎగుమతిని నిషేధించినా.. పలు సందర్భాల్లో కిమ్ రోల్స్ రాయిల్స్ ఫాంటమ్, మెర్సిడెస్ లిమోసిన్లు, లెక్సస్ SUV వంటి కార్లలో కిమ్ తిరుగుతూ కనిపించాడు.