V6 News

ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే యమలోకానికే..

ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే యమలోకానికే..
  • యమధర్మరాజు వేషధారణలో  వినూత్న అవగాహన

పద్మారావునగర్, వెలుగు: రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగించేందుకు నార్త్​ జోన్​ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా డాక్టర్​ గురవారెడ్డి  పర్యవేక్షణలో కార్యక్రమం చేపట్టారు. మంగళవారం రాణిగంజ్ సిగ్నల్ వద్ద యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తితో ప్రయాణికుల్లో అవేర్​నెస్​ కల్పించారు.

ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, హెల్మెట్, సీట్‌బెల్ట్, లేన్ డిసిప్లేన్ ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనాలు పాటించిన వాహనదారులకు ప్రోత్సాహకంగా చాక్లెట్లు, పూలు అందజేశారు. కార్యక్రమంలో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, మహంకాళి ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.