హెల్త్ మాత్రమే కాదు.. ప్రజలకు మంచి లైఫ్ ‌‌స్టైల్ కూడా ముఖ్యమే

హెల్త్ మాత్రమే కాదు.. ప్రజలకు మంచి లైఫ్ ‌‌స్టైల్ కూడా ముఖ్యమే

కర్నాటకలోని కుడ్లా ప్రాంతానికి చెందిన నిరంజన్ సమాని సక్సెస్ ‌‌ఫుల్ డాక్టర్ ‌‌గా పేరు తెచ్చుకున్నాడు. అందుకోసం కొన్నేండ్ల పాటు కష్టపడ్డాడు. రోగి పరిస్థితిని అంచనా వేయడంలో, సరైన మందులు సూచించడంలో ఆయన ఎక్స్ ‌‌పర్ట్ ‌‌. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. తను తెలుసుకున్న విషయాలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకోవాలి అనుకున్నాడు. అందుకే ఈ డాక్టర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అవతారమెత్తాడు. ఆయన కంటెంట్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతోంది. 

నిరంజన్ సమాని మంగుళూరులో పుట్టి, పెరిగాడు. వాళ్ల నాన్న బిజినెస్​మెన్ ‌‌. అమ్మ గృహిణి. సమాని చిన్నప్పటినుంచి చదువులో బాగా యాక్టివ్ ‌‌గా ఉండేవాడు. కానీ.. కొత్తవాళ్లతో మాట్లాడటానికి చాలా సిగ్గుపడేవాడు. మెడికల్ కాలేజీలో కూడా అతనికి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మాత్రమే ఉండేవాళ్లు. అందుకే యూట్యూబ్ ‌‌లో మాట్లాడడానికి చాలా టైం పట్టిందట. మొదటగా సోషల్ మీడియాలో లిప్ ‌‌సింకింగ్ వీడియోలు చేసేవాడు. తర్వాత చిన్న చిన్న అవేర్​నెస్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. కానీ.. పెద్దగా రీచ్ రాలేదు. అప్పుడు సమాని సోషల్ మీడియోలో వైరల్ అవుతున్న వీడియోలు చూశాడు. వాటిలో ఏముంది? ఎందుకు చూస్తున్నారు? అని గమనించాడు. అప్పుడు అతనికి జనాలు ఎలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తున్నారనేది అర్థమైంది. అందుకే జనాలకు నచ్చే విధంగా కంటెంట్‌‌ని క్రియేట్ చేయాలనుకున్నాడు. ప్రజలు ఎక్కువగా ఎంటర్ ‌‌టైన్ ‌‌మెంట్ వీడియోలకు ఎట్రాక్ట్ అవుతున్నారని, తను కూడా హెల్త్ వీడియాల్లో కాస్త కామెడీ యాడ్ చేశాడు. దాంతో చాలామందికి వీడియోలు రీచ్ అయ్యాయి. ఎక్కువగా జుట్టు రాలడం, చర్మ సమస్యలు, గైనిక్ సమస్యలకు ప్రైమరీ ట్రీట్ ‌‌మెంట్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాడు. వాటి ట్రీట్ ‌‌మెంట్ ‌‌కు ఇంట్లో ఉండే ఇంగ్రెడియెంట్స్ ‌‌ని రెమిడీస్​గా ఎలా వాడుకోవాలో కూడా చెప్తుంటాడు. ఇలా వీడియోలు చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకు ఇన్ ‌‌స్టాగ్రామ్ ‌‌లో ఫాలోయింగ్ బాగా పెరిగింది. ప్రస్తుతం ఆయనకు ఇన్​స్టాగ్రామ్ ‌‌లో 5.86 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

రీచ్ పెరిగింది?

ఈ మధ్య ఆయన వీడియోలకు చాలా రీచ్ పెరిగింది. తన ఛానెల్ ‘‘డాక్టర్ నిరంజన్ సమాని’’కి 2.2 లక్షల సబ్ ‌‌స్క్రయిబర్స్ మాత్రమే ఉన్నా వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రస్తుతం అతను వారానికి ఐదారు వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ఛానెల్ పెట్టి దాదాపు ఐదేండ్లు అయింది. ఇప్పటివరకు 500కు పైగా వీడియోలు పోస్ట్ చేశాడు. ఆయన చేసే వీడియోలకు పెద్దగా ఎడిటింగ్ కూడా అవసరం ఉండదు. మరో విషయం ఏంటంటే.. సమాని మంచి సింగర్ కూడా. అతను పాటలు పాడిన వీడియోలు కూడా ఈ ఛానెల్​లో పోస్ట్ చేస్తుంటాడు. హెల్త్‌ టిప్స్ వీడియోల వల్ల దేశంలోని చాలా ప్రాంతాల నుంచి సమాని ఛానెల్​కు వ్యూస్ వస్తున్నాయి. ఆ ఫాలోయింగ్ ‌‌తో తనకు బాగా ఇష్టమైన తన మాతృభాష ‘‘తుళు” కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ భాష అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇన్​స్టాగ్రామ్ ‌‌లో ‘‘వేర్ కుడ్ల” అనే పేరుతో ఒక పేజీని మొదలుపెట్టాడు. అందులో తుళు భాషలో కంటెంట్ పోస్ట్ చేస్తున్నాడు. మెయిన్ ఛానెల్​లో వీడియోలు చూసేవాళ్లు కూడా ఈ పేజీలో వీడియోలు చూస్తున్నారు. 

యాక్టింగ్ అంటే ఇష్టం

‘‘ప్రస్తుతం మాస్టర్స్ చేస్తున్నా. కానీ.. యాక్టింగ్​పై కూడా ఇంట్రెస్ట్ ఉంది. అందుకే యాక్టింగ్ కోసం కూడా కొంత టైం కేటాయిస్తా. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఏ లాంగ్వేజ్ అయినా యాక్టింగ్ చేయడానికి ఇబ్బంది లేదు. దాంతోపాటు రెగ్యులర్​గా సింగింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నా”అంటున్నాడు సమాని. అంతే కాదు.. సమానీకి స్క్రిప్ట్ రైటింగ్ మీద పట్టు ఉందట. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్‌‌లు కూడా రాస్తున్నాడు. 

వీడియోలు ఎందుకు? 

హెల్త్ మాత్రమే కాదు.. ప్రజలకు మంచి లైఫ్ ‌‌స్టైల్ కూడా ముఖ్యం అంటాడు సమాని. అందుకే లైఫ్​స్టైల్ వీడియోలు కూడా చేస్తుంటాడు. అది కూడా సోషల్ మీడియా ద్వారా చెప్తేనే ఈజీగా రీచ్ అవుతుందని డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. కరోనా టైంలో కూడా ప్రజల అపోహలను దూరం చేసి, ఫ్యాక్ట్స్ చెప్తూ వీడియోలు చేశాడు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో స్ర్పెడ్ అయ్యే తప్పుడు హెల్త్​టిప్స్ వీడియోలను గుర్తించి, అవి తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.