సంజు శాంసన్ కాదు?.. సూర్య తర్వాత భారత టీ20 కెప్టెన్ అతడే.. అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంజు శాంసన్ కాదు?.. సూర్య తర్వాత భారత టీ20 కెప్టెన్ అతడే.. అజిత్ అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Team India New Captain: భారత క్రికెట్‌లో త్వరలోనే భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ (BCCI) వర్గాలు. ఈ ఏడాది ప్రారంభంలోనే టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్థానంలో.. లాంగ్ టర్మ్ కెప్టెన్‌ను తీసుకురావాలని సెలెక్టర్లు ప్లాన్ చేస్తున్నారట. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను కూడా ఒప్పించేందుకు బీసీసీఐ చర్చలు జరుపుతోంది.

సూర్య కెప్టెన్సీ మార్చడానికి అసలు రీజన్స్ ఇవే: 
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా సక్సెస్ అయినా.. గత కొన్ని రోజులుగా అతని బ్యాటింగ్ ఫామ్ ఒక్కసారిగా పడిపోవడం, దానికి తోడు మణికట్టు గాయం (Wrist Injury) వేధించడం సెలెక్టర్లను ఆందోళనకి గురి చేసింది. అయితే సూర్యకుమార్ మాత్రం తనకు ఎలాంటి ఇంజూరీ లేదని క్లారిటీ ఇస్తూ.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌పై కన్నేశానని బహిరంగంగానే చెప్పాడు. కానీ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అగార్కర్ ప్యానెల్ మాత్రం ఒక పక్కా సక్సెషన్ ప్లాన్‌తో సిద్ధంగా ఉంది. శ్రేయస్ అయ్యర్‌ను వైట్-బాల్ (T20I, ODI) రెండింటికీ లీడర్‌గా ప్రొజెక్ట్ చేస్తూ.. బ్యాటింగ్ ఆర్డర్‌లో నంబర్ 4 స్థానంలో సూర్యకుమార్‌ను రీప్లేస్ చేయాలని చూస్తున్నారు.

అగార్కర్ vs గంభీర్.. ఏకాభిప్రాయం కుదిరేనా?: 
టీమిండియాలో భారీ మార్పులు చేయాలంటే సెలెక్టర్లతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ కూడా చాలా అవసరం.. గతంలో అజిత్ అగార్కర్, గంభీర్ మధ్య టీమ్ సెలక్షన్, స్ట్రాటజీల విషయంలో కొన్ని విభేదాలు ఉన్నట్లు బయట టాక్ నడిచింది. బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అజిత్ అగార్కర్ చాలా స్ట్రాంగ్ చీఫ్ సెలక్టర్.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి అతను వెనకాడడు.. అందుకే వరల్డ్ కప్‌కు ముందే శ్రేయస్ అయ్యర్‌ను వన్డే వైస్ కెప్టెన్‌గా నియమించారు. శ్రేయస్ అనేది కోచ్ (గంభీర్) ఛాయిస్ అవుతుందా? లేదా అతని మైండ్‌లో వేరే ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే సెలెక్టర్లు దానికి ఒప్పుకుంటారా? అనే అంశాలపైనే ఇప్పుడు హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలిపాడు. 

కెప్టెన్సీ రేసులో ఉన్న మిగతా ప్లేయర్స్: 
శ్రేయస్ అయ్యర్‌తో పాటు టీ20 కెప్టెన్సీ రేసులో మరి కొంత మంది యంగ్ ప్లేయర్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 
* సంజు శాంసన్: రీసెంట్ ఫామ్ బాగున్నా.. అతని కెరీర్‌లో ఉండే ఇన్‌కన్సిస్టెన్సీ మైనస్ పాయింట్. ఇక శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ కూడా రేసులో ఉన్నప్పటికీ.. శ్రేయస్ అయ్యర్‌కు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది.

శ్రేయస్ అయ్యర్‌కు ప్లస్ పాయింట్: 
డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీని (KKR - 2024) ఛాంపియన్‌గా నిలబెట్టడంతో పాటు మరో ఫ్రాంచైజీని (PBKS) ఫైనల్స్ వరకు నడిపించిన కెప్టెన్సీ అనుభవం అతని సొంతం. త్వరలోనే జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ల నాటికి ఈ కెప్టెన్సీ వివాదంపై ఒక అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.