నేను జైల్లో ఉంటానో లేదో తెలియదు.. ఆప్ను మాత్రం గెలిపించండి: అరవింద్ కేజ్రీవాల్

నేను జైల్లో ఉంటానో లేదో తెలియదు..  ఆప్ను మాత్రం గెలిపించండి: అరవింద్ కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.  మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా   సింగ్రౌలిలో జ‌రిగిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ.. రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడ‌య్యే నాటికి తాను జైల్లో ఉంటానో..బ‌య‌ట ఉంటానో కూడా   తనకు తెలియదని చెప్పారు. అయితే తనకు జైలు అంటే భయం లేదన్నారు కేజ్రీవాల్.  ఢిల్లీ, పంజాబ్ ప్రజలు ఎలాగైతే ఆప్ ను  ఆదరించారో మధ్యప్రదేశ్ ప్రజలు కూడా ఆప్ కు పట్టం కట్టాలని కోరారు. 

వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు  కేజ్రీవాల్  ఇవాళ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు.  చట్ట విరుద్ధంగా, రాజకీయ ప్రేరేపితంగా తనకు జారీ చేసిన సమన్లను వెనక్కి తీసుకోవాలని  కోరుతూ ఆయన  ఈడీ అధికారులకు లేఖ రాశారు.  మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న తనని ఆపేందుకే ఈ సమన్లు జారీ చేశారని ఆయన ఆరోపించారు.  బీజేపీ అభ్యర్థన మేరకు సమన్లు ​​పంపినట్లు కూడా ఆయన ఆరోపించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే జైలులో ఉన్నారు.

ALSO READ :  ఆ ముఖ్యమంత్రిని చంపేస్తాం.. వార్నింగ్ పై పోలీస్ ఎంక్వయిరీ