అత్తాపూర్ SR DIGI స్కూల్కు నోటీసులు

అత్తాపూర్ SR DIGI స్కూల్కు నోటీసులు

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో ఎస్ఆర్ డీజి స్కూల్ పై ఉక్కుపాదం మోపారు విద్యాశాఖ అధికారులు. విద్యార్థిని వేధించిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. స్కూల్ లో సీసీ కెమెరాల నిఘా లేదంటూ.. చైల్డ్ కౌన్సిలింగ్ ఏర్పాట్లు లేవంటూ విద్యాశాఖ ఎమ్ఈవో రాంరెడ్డి హెచ్చరించారు. ఎస్ఆర్ డీజి స్కల్ కు విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. 

ఏం జరిగింది? 

రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లో స్ఆర్ డీజి  స్కూల్ లో విష్ణు అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా విష్ణు..  ఆ స్కూల్ లో 8 తరగతి చదువుతోన్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.  అంతేకాకుండా విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన  తల్లిదండ్రులకు చెప్పేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ కు చేరుకుని దాడికి దిగారు. అయితే అప్పుడు విష్ణు ఇంకా స్కూల్ కు రాలేదని అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ వస్తుందంటూ స్కూల్ యాజమాన్యం  బుకాయించింది. చివరికి అతని జాడ కనిపెట్టి చితకబాదిపోలీసులకు అప్పగించారు విద్యార్థిని కుటుంబ సభ్యులు.