ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్: ఇంటర్ పాసైతే చాలు, వేంటనే అప్లయ్ చేసుకోండి

ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్: ఇంటర్ పాసైతే చాలు, వేంటనే అప్లయ్ చేసుకోండి

ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్–2026(ఏఐఎల్ఈటీ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐండేండ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఏడాది ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆగస్టు 7 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. చివరి తేదీ నవంబర్ 10. జాతీయ స్థాయిలో డిసెంబర్ 14న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 

విద్యార్హతలు: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే చాలు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులకు రూ.1500. బీపీఎల్​కు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 7.

లాస్ట్ డేట్: నవంబర్ 10.

 ఎగ్జామ్ డేట్: డిసెంబర్ 14. 

ఎగ్జామ్ ప్యాటర్న్

జాతీయ స్థాయిలో నిర్వహించే ఏఐఎల్ఈటీ ఎంట్రెన్స్ టెస్టులో 150 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్–ఏలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, సెక్షన్–బిలో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, సెక్షన్–సీలో లాజికల్ రీజనింగ్ 70 ప్రశ్నలు 70 మార్కులకు ఉంటుంది. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాల్లో  పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఎంట్రెన్స్ టెస్టులో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన మార్కులు వస్తే లాజికల్ రీజినింగ్​లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు. 

పూర్తి వివరాలకు  nationallawuniversity delhi.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.