అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్!

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్!

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఈ మేరకు 36(8 కొత్త వాటితో కలిపి) ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 607 ఖాళీల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

మొత్తం 34 డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉండగా, జనరల్ మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనరల్ సర్జరీలో కలిపి 85 పోస్టులకుపైగా వేకెన్సీ ఉన్నాయి. మిగిలిన డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో తక్కువ పోస్టులు ఉన్నాయి. అకడమిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన మార్కులు, కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 2,400 అప్లికేషన్లు

ప్రభుత్వ దవాఖాన్లలోని 435 ఎంబీబీఎస్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్) డాక్టర్ పోస్టుల భర్తీకి ఇటీవల మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియగా బుధవారం నాటికి సుమారు 2,400 మంది డాక్టర్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకో వెయ్యి అప్లికేషన్లు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.