
భారత ప్రభుత్వ సంస్థ ప్రసార భారతి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కంటెంట్ మేనేజర్, క్రియేటివ్ డిజైనర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 24.
పోస్టుల సంఖ్య: 50.
పోస్టులు: కంటెంట్ మేనేజర్ (సోర్సింగ్) 01, కంటెంట్ మేనేజర్ – ఓటీటీ ప్లాట్ఫామ్స్ (ఉపన్యాసాలు) 02, కంటెంట్ మేనేజర్ (ప్రొడక్షన్) 02, క్రియేటివ్ డిజైనర్ 01, గ్రాఫిక్ ఎడిటర్ 04, వీడియో ఎడిటర్ 04, కంటెంట్ ఎగ్జిక్యూటివ్ 25, లైబ్రరీ అసిస్టెంట్ 02, ఐటీ ఎగ్జిక్యూటివ్ 03, జూనియర్ మేనేజర్ (డిస్ట్రిబ్యూషన్) 01 మేనేజర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) 01, జూనియర్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) 02, ఫైనాన్స్ ప్లానర్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, బీబీఏ, బి.కాం, సీఏ, ఎం.కాం, ఎంబీఏ/ పీజీడీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 09.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 24.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు prasarbharati.gov.in
వెబ్సైట్లో సంప్రదించగలరు.