మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
  •     ఈ నెల 15 నుంచి 25 దాకా అప్లికేషన్లకు చాన్స్

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు(ఇంగ్లిష్ మీడియం) ఫస్ట్ ఫేజ్​ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10వ తరగతి పూర్తయిన స్టూడెంట్లు ఈ నెల 15 నుంచి 25 వరకు tsmodelschools.com ద్వారా అప్లై చేసుకోవాలని, ఇందులో పూర్తి వివరాలు ఉంటాయని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీల్లో ఒక్కో కోర్సులో 40 సీట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో 31 వేలకు పైగా సీట్లు ఉన్నాయని వెల్లడించారు.