ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సంచలనాల దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా' (Raaka) . ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ అయిన రోజు నుంచే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఊపు అలా ఉంటే.. లేటెస్ట్ గా బన్నీ ముంబైలోని జుహూ వీధుల్లో ప్రత్యక్షమవడంతో అక్కడ ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ ను చూడగానే ఫ్యాన్స్ ఎగబడ్డారు. తమ అభిమాన హీరోను చుట్టుముట్టేసి.. గాల్లోకి చేతులెత్తేస్తూ "రాకా.. రాకా.." అంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ క్రేజీ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
బన్నీని చుట్టుముట్టేసిన ఫ్యాన్స్..
జుహులో బన్నీ తన కారు వైపు వెళ్తుండగా, ఫ్యాన్స్ భారీగా చుట్టుముట్టేశారు. అభిమానులంతా గట్టిగా "రాకా.. రాకా.." అంటూ నినాదాలు చేస్తుంటే, ఐకాన్ స్టార్ తన సిగ్నేచర్ స్టైల్‌లో స్మైల్ ఇస్తూ, చేతులు ఊపుతూ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. స్టైలిష్ స్టార్ ఈజ్ బ్యాక్.. ఏదో గట్టి ప్లానింగ్ జరుగుతోంది అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొందరు సెలబ్రిటీలను మరీ నెత్తిన పెట్టుకోకండి, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఫస్ట్ లుక్ తోనే మైండ్ బ్లాక్!
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే కానుకగా రిలీజ్ చేసిన 'రాకా' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇండస్ట్రీని షేక్ చేసింది. గుండు బాస్ అవతారంలో, కళ్లకు కాటుక పెట్టుకుని, చేతిలో పదునైన జంతువుల గోళ్లను పట్టుకుని బన్నీ ఇచ్చిన వైల్డ్ లుక్ చూసి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ గురించి అట్లీ ఎమోషనల్ అవుతూ.. రాకా కేవలం సినిమా మాత్రమే కాదు, నా 18 ఏళ్ల కల. ఇన్నాళ్లు ఈ ఆలోచనను నా గుండెల్లో దాచుకున్నాను. ఇది నన్ను ఎంతగానో పరీక్షించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
అటు ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాను ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసేలా, అంతర్జాతీయ స్థాయిలో భారీ విజువల్ వండర్‌గా ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. 'పుష్ప 2: ది రూల్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
#RAAKA pic.twitter.com/BY1dzQFLY8
— Allu Arjun (@alluarjun) April 8, 2026
