Vastu tips  : ఫోన్ చార్జింగ్, ఇన్వెర్టర్ పాయింట్, సోలార్ ప్యానెల్స్ ఎక్కడ ఉండాలి..!

Vastu tips  : ఫోన్ చార్జింగ్, ఇన్వెర్టర్  పాయింట్, సోలార్ ప్యానెల్స్ ఎక్కడ ఉండాలి..!

ప్రస్తుతం పనివిధానమే కాదు.. లైఫ్​ స్టైల్​ కూడా మారిపోయింది.  అందుకే చాలా మంది పూర్వకాలంలో  పెద్దలు నిర్మించిన పెద్ద పెద్ద ఇళ్లను రిమూవ్​ చేసి ఆధునిక కాలంలో జీవనశైలికి అనుగుణంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు.  ప్రస్తు కాలానికి సరిపోయేలా సరికొత వాస్తు గురించి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆధునికయుగంలో  వాస్తు సిద్దాంతాన్ని దిశలకే పరిమితం చేయకుండా అంటే ఆ పద్దతులను పాటిస్తూ.. పర్యావరణాన్ని కాపాడేలా గ్రీన్​ వాస్తుకు ప్రాధాన్యత ఇవ్వడం కొత్త ట్రెండ్​ మొదలైంది.  గతంలో  లైటింగ్​ కోసం కిరసనాయిల దీపాలు ఉండేవి.. తరువాత ఎలక్ట్రిసిటి వచ్చింది.  

సోలార్​ ప్యానెల్స్ ప్రస్తుతం చాలామంది వీటిని వాడుతున్నారు.  ఈ సోలార్​ ప్యానెల్స్​ను వాస్తు ప్రకారం ఆగ్నేయంలో అమర్చాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఆగ్నేయం దిక్కు శక్తికి మూలం.. ఆ దిక్కులో ఉన్న వస్తువులకు బాగా శక్తి ఉంటుంది.  అక్కడ ఉంచిన వస్తువులతో కూడాచాలా జాగ్రత్తగా ఉండాలి.  ఆగ్నేయంలో స్టవ్​.. పొయ్యి మొదలైనవి ఉండాలంటారు.  వీటి నుంచి మంటకు చాలా శక్తి ఉంటుంది కదా.. అందుకే ఈ దిక్కులో టాప్​ పైన సోలార్​ ప్యానెల్స్​ ను ఉంచితే ఇంధన శక్తి పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. 

ఫోన్​ చార్జింగ్​ పాయింట్​ : ప్రస్తుత కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగం బాగా పెరిగింది.  వీటి వలన నెగిటివ్​ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేసిస్తుంది. దీనిని  తగ్గించేందుకు ఇంటి ఈశాన్యంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా ఖాళీగా ఉంచాలి. ఇది మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది.  ఇన్వర్టర్​ బ్యాటరీ.. జనరేటర్​ వంటివి ఆగ్నేయంలో ఉండాలి.  అలాగే ఫోన్, ల్యాప్​ ట్యాప్​ చార్జింగ్​ పాయింట్లు వర్క్​ ప్లేస్​ గదిలో ఆగ్నేయంలో ఉండేవిధంగా ప్లాన్​ చేసుకోండి.

ప్రస్తుతం పల్లెలకు కూడా అపార్ట్​ మెంట్​ కల్చర్​ వచ్చింది.  అలాంటప్పుడు మెత్తం వాస్తు చూడటం కష్టం.. ఎవరు ఉండే అపార్ట్​ మెంట్​ ఆధారంగా వాస్తును చూసుకోవాలి. ఇప్పుడు చిన్న ఇళ్లలో కూడా ఇంటి మధ్య భాగాన్ని ఖాళీగా ఉంచడం లేదా అక్కడ బరువైన సోఫాలు వేయకుండా ఉండటం వల్ల ఇంటి మొత్తం శక్తి ప్రసరణ సాఫీగా జరుగుతుందని చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని వాస్తు పండితులసలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.