PEDDI Bookings: దుమ్మురేపుతున్న ‘పెద్ది’ బుకింగ్స్.. 24 గంటల లోపే హౌస్‌ఫుల్ వైబ్స్.. భారీ ఓపెనింగ్స్ ఖాయం?

PEDDI Bookings: దుమ్మురేపుతున్న ‘పెద్ది’ బుకింగ్స్.. 24 గంటల లోపే హౌస్‌ఫుల్ వైబ్స్.. భారీ ఓపెనింగ్స్ ఖాయం?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ (Peddi) వచ్చేస్తోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా 27 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

ఓవర్సీస్‌లో ‘పెద్ది’ హవా..

‘పెద్ది’ చిత్రాన్ని నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ విడుదల చేస్తోంది. సినిమాపై ఉన్న భారీ అంచనాల మధ్య మేకర్స్ ఓవర్సీస్ బుకింగ్స్‌ను ప్రారంభించారు. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటలు పూర్తికాకముందే ఉత్తర అమెరికాలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. గంట గంటకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండటంతో ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’ భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రత్యేకంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకే ఈ స్థాయి హైప్ రావడంతో.. ట్రైలర్‌, మిగతా సాంగ్స్ విడుదలైతే ‘పెద్ది’ మేనియా మరింత పెరగడం ఖాయమని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి..

ఇప్పటికే ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. లేటెస్ట్ గా ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు దర్శకుడు బుచ్చి బాబు సానా సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. మరో నాలుగు రోజుల్లో ట్రైలర్ కూడా విడుదలయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం?

ఈ సినిమాపై నెలకొన్న అంచనాల దృష్ట్యా, కేవలం తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ బిజినెస్ మాత్రమే దాదాపు రూ.200 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరలకు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా అంతర్జాతీయ థియేట్రికల్ హక్కులు సుమారు రూ.40 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇది ఈ ఏడాది ఒక తెలుగు సినిమాకు జరిగిన అత్యుత్తమ ఓవర్సీస్ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది.

అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రామ్ చరణ్కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ డీల్‌కు ప్రధాన కారణమని సినీ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ మార్కెట్‌లో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే సుమారు 9 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.