LSG vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూర్.. కీలక ప్లేయర్లు మ్యాచ్కు దూరం

LSG vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూర్.. కీలక ప్లేయర్లు మ్యాచ్కు దూరం

ఐపీఎల్ లో భాగంగా 50వ మ్యాచ్ లో బెంగళూర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 2026 మే 07వ తేదీన లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయ్ ఎకానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకంగా మారింది. గత ఓటమి నుంచి కోలుకుని.. లక్నోను ఓడించి నెంబర్ వన్ ప్లేస్ ను కైవసం చేసుకోవాలని బెంగళూర్ చూస్తోంది. అదే సమయంలో.. ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కాలంటే పక్కా గెలవాలనే పట్టుదలతో లక్నో ఉంది. 

టీమ్స్:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): 

జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(సి), జితేష్ శర్మ(w), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్, జోష్ హేజిల్‌వుడ్

  • లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): 

మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్(w/c), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్

LSG టీమ్ లో మార్పులు: జోష్ ఇంగ్లిస్, మొహ్సిన్ ఖాన్ , అవేష్ ఖాన్ ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. అర్షిన్ కులకర్ణి, దిగ్వేష్ రాఠి, షాబాజ్ ఆడుతున్నారు.

  • ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్‌లు వీరే:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: రాజోర్డాన్ కాక్స్, టిమ్ డేవిడ్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్, వెంకటేష్ అయ్యర్

లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ సబ్స్: మయాంక్ యాదవ్, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమద్, మణిమారన్ సిద్ధార్థ్, ఆవేశ్ ఖాన్

 

  • పిచ్, వెదర్:

2026 ఐపీఎల్ సీజన్ లో లక్నో పిచ్.. బ్యాటర్లకు కాస్త కష్టంగానే ఉంది. ఇక్కడ చాలా వరకు తక్కువ స్కోర్స్ నమోదు కావడం చూస్తూ వస్తుంన్నాం. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ 155 మాత్రమే. అదే సమయంలో బౌండరీలు తక్కువ డిస్టెన్స్ లో ఉండటం బ్యాటర్లకు ఉపశమనం. 

పిచ్ బ్యాటర్లను కచ్చితంగా పరీక్షిస్తుందని చెప్పవచ్చు. డ్రై సర్ఫేస్ తో.. లైట్ గా గ్రాస్ తో.. మ్యాచ్ జరిగే కొద్ది మార్పులకు గురికావచ్చు. ఈవినింగ్ సైడ్ బాల్ కాస్త స్లో అయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్లకు కలిసొస్తుంది. సో.. ఇక్కడ ఛేజింగ్ చేసిన టీమ్ లే ఎక్కువగా గెలిచాయి. మొత్తం 15 మ్యాచ్ లలో 12 మ్యాచ్ లు చేజింగ్ విన్నర్స్ కావడం విశేషం. 170 రన్స్ చేస్తే ఈ పిచ్ పై గెలుపుకు ట్రై చేసుకోవచ్చు.