ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీల్లో కేటగిరీ-1 కింద పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, కామర్స్ విభాగాల్లో ఉన్న ఖాళీల కోసం ఆగస్టు 14 లోపు దరఖాస్తులను సంబంధిత ఫ్యాకల్టీల డీన్ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(నెట్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సాధించిన వారితో పాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్ పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.