- వచ్చే నెల 25న లాటరీ
హైదరాబాద్, వెలుగు: పోచారం, గాజుల రామారంలో ఉన్న రెండు టవర్లను గంపగుత్తగా వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు టవర్లలో మొత్తం 232 ఫ్లాట్లు ఉన్నాయని ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. పోచారంలో 3,287 గజాల్లో ఉన్న టవర్ ను రూ. 29.51 కోట్లకు విక్రయిస్తున్నామని, ఒక్కో ఎస్ఎఫ్ టీకి రూ.1,650 గా ఖరారు చేశామని చెప్పారు.
గాజుల రామారంలో 6,703 గజాల్లో ఉన్న టవర్ ను రూ.26.33 కోట్లకు విక్రయిస్తున్నామని, ఒక్కో ఎస్ఎఫ్ టీకి రూ.1,995 గా ఖరారు చేశామని పేర్కొన్నారు. హిమాయత్ నగర్ లోని కార్పొరేషన్ ఆఫీస్ లో వచ్చే నెల 25న లాటరీ తీస్తామని వెల్లడించారు.
