అగ్రివర్సిటీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్

అగ్రివర్సిటీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలోని వివిధ డిప్లొమా కోర్సుల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం గురువారం నోటిఫికేషన్​రిలీజ్ చేశారు. వ్యవసాయ, సేంద్రియ, ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సులు, సీట్ల సంఖ్య, ఫీజు వివరాలను వర్సిటీ వెబ్​సైట్ www.pjtsau.edu.in లో పొందుపరిచినట్లు రిజిస్ట్రార్ వెంకటరమణ తెలిపారు.

కౌన్సిలింగ్ జులై మొదటి వారంలో ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.