హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఏకలవ్య గురుకుల ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు అప్లై చేసుకోవాలని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ సీతాలక్ష్మీ తెలిపారు. రాష్ట్రంలోని 23 స్కూళ్లలో 1,380 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఈ అడ్మిషన్లకు కేవలం ఎస్టీలు మాత్రమే అర్హులని, ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్చి 29న ఉంటుందన్నారు.
