యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌ లో 16వ సారి జోకో..

యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌ లో 16వ సారి జోకో..
  • నొవాక్‌‌‌‌.. సబలెంకా, గాఫ్ ముందంజ

న్యూయార్క్: కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 25వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ 38 ఏండ్ల వయసులోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. యూఎస్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో 16వ సారి ప్రి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  ఏడో సీడ్ నొవాక్ 6-–4, 6–-7 (4/7), 6–-2, 6–-3తో  క్వాలిఫయర్ కామెరూన్ నోరీ (బ్రిటన్‌)పై విజయం సాధించాడు.  దాంతో 1991 తర్వాత యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరిన ఓల్డెస్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ టోర్నీల్లో నొవాక్ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరడం ఇది 69వ సారి. దాంతో రోజర్ ఫెడరర్‌‌‌‌‌‌‌‌ రికార్డును అతను సమం చేశాడు.  

హార్డ్ కోర్టుల్లో జొకోవిచ్‌కు ఇది 192వ గ్రాండ్ స్లామ్ మ్యాచ్ విక్టరీ. మెన్స్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌లో ఇదో కొత్త రికార్డు కావడం మరో విశేషం.  ఈ మ్యాచ్ తొలి  సెట్‌‌‌‌‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ను వెన్నునొప్పి బాధించింది. తొలి సెట్‌‌‌‌‌‌‌‌లో 5–-4 ఆధిక్యంలో  ఉన్నప్పుడు ఆటను ఆపి ఆర్థర్ యాష్ స్టేడియం నుంచి బయటకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. దాంతో అతని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, నొప్పి ఉన్నప్పటికీ సెట్‌‌‌‌‌‌‌‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్‌‌‌‌‌‌‌‌లోనూ చికిత్స పొందిన నొవాక్‌‌‌‌‌‌‌‌ టై బ్రేక్‌‌‌‌‌‌‌‌లో దాన్ని కొల్పోయాడు. ఓవైపు వెన్నునొప్పి ఇబ్బంది పెడుతున్నా.. తర్వాతి రెండు సెట్లలో తన మార్కు ఆటతో నోరీ ఆట కట్టించాడు.  

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో జొకోవిచ్ తన సర్వీసుతో ఆకట్టుకున్నాడు. ఏకంగా 18 ఏస్‌‌‌‌‌‌‌‌లు కొట్టాడు.  జొకోవిచ్ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో జర్మనీ వెటరన్  జాన్- లెనార్డ్  స్ట్రఫ్‌‌‌‌‌‌‌‌తో తలపడతాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్ట్రఫ్‌‌‌‌‌‌‌‌  6–4, 6–3, 7–6 (9/7) వరుస సెట్లలో  17వ సీడ్ ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా)ను ఓడించాడు. మరో అమెరికన్‌‌‌‌‌‌‌‌, నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7–-6 (7/3), 6–-7 (9/11), 6–-4, 6–-4తో స్విస్ క్వాలిఫైయర్ జెరోమ్ కైమ్‌‌‌‌‌‌‌‌ను ఓడించి ముందంజ వేశాడు. 

సబలెంకా, గాఫ్‌ సాఫీగా

విమెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్ నం. 1 అరీనా సబలెంకా సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. మూడో  రౌండ్‌‌‌‌‌‌‌‌లో బెలారస్ స్టార్ 6-–3, 7–-6(6/2)తో 31వ సీడ్ లేలా ఫెర్నాండెజ్‌‌‌‌‌‌‌‌ (కెనడా)ను ఓడించింది. 2021 యూఎస్ ఓపెన్ సెమీ-ఫైనల్లో లేలా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.  మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా)6–3, 6–1తో 28వ సీడ్ మగ్దలేనా ఫ్రెచ్ (పోలాండ్‌)ను వరుస సెట్లలో చిత్తు చేసింది.  

చెక్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బార్బోరా క్రెజికోవా 4–6, 6–4, 6–4తో పదో సీడ్ అమెరికన్ ఎమ్మా నవారోను ఓడించి ముందంజ వేసింది. లోకల్ ప్లేయర్ టేలర్ టౌన్‌‌‌‌‌‌‌‌సెండ్7–-5, 6–-2తో ఐదో సీడ్ మిరా ఆండ్రీవాపై నెగ్గి సంచలనం సృష్టించింది.  నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌లో తను  క్రెజికోవాతో తలపడనుంది. 

అనిరుధ్ జోడీ ముందంజ

మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ప్లేయర్లు అనిరుధ్ చంద్రశేఖర్ – విజయ్ ప్రశాంత్ శుభారంభం చేశారు. తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో 3–-6, 6–-3, 6–-4తో ఎనిమిదో సీడ్, లోకల్ ప్లేయర్లు క్రిస్టియన్ హారిసన్– ఎవన్ కింగ్లను ఓడించి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. అయితే, మరో ఇండియా జోడీ బొల్లిపల్లి రిత్విక్ –శ్రీరామ్‌‌‌‌‌‌‌‌ బాలాజీ 6–3, 6–7 (8/10), 4–6తో బార్ట్ స్వీవెన్స్‌‌‌‌‌‌‌‌ (నెదర్లాండ్స్‌)–వెసిల్ కిర్కోవ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయి తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే ఇంటిదారి పట్టింది.