
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ సంస్థల్లో మహిళల రక్షణ కోసం సేఫ్టీ క్లబ్‌లు ఏర్పాటు చేస్తామని ఉమెన్ సేఫ్టీ వింగ్ఐజీ స్వాతీలక్రా తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో షీ టీమ్ స్టేట్‌వైడ్ వాట్సాప్ నంబర్ 944 166 9988ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. గాంధీ మెడికల్ కాలేజీలో పైలట్ ప్రాజెక్టుగా సేఫ్టీ క్లబ్ ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలవారీగా షీ టీమ్స్‌కు వాట్సాప్ నంబర్స్ ఉన్నాయని, సరిహద్దుల విషయంలో అనుమానం వచ్చినప్పుడు స్టేట్ వాట్సాప్ నంబర్‌ను వాడుకోవాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్లు 100, 112 అందుబాటులో ఉన్నాయని, వాటితోపాటు హాక్ ఐ అప్లికేషన్ పనిచేస్తోందన్నారు. ఇప్పట్లో ఆడవాళ్లందరికీ సెల్‌ఫోన్స్ ఉంటున్నాయని, అందరూ హాక్ ఐ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. జర్నీ టైమ్‌లో వెహికల్ డ్రైవర్, తోటి ప్యాసింజర్స్‌పై అనుమానం వస్తే వెంటనే హాక్ ఐ యాప్‌లోకి వెళ్లి ఎస్‌ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే పోలీసులు వెహికల్ మార్గాన్ని ట్రేస్ చేస్తారన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీ సుమతి మాట్లాడుతూ.. కూతుళ్లకే కాకుండా కొడుకులకు కూడా తల్లిదండ్రులు మంచిమాటలు చెప్పి పెంచాలని, ఆడపిల్లల జోలికి వెళ్లొద్దని సూచించాలన్నారు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ.. అంగవైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరమన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ నాగమణి, వైస్ ప్రిన్సిపల్ సులేమాన్, నర్సింగ్ స్టూడెంట్స్, హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు.